ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆర్టీసీ బస్సు ఆపి విద్యార్థుల ఆందోళన
జగిత్యాల, (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆర్టీసీ బస్సు ఆపి విద్యార్థుల ఆందోళన చేశారు. సమయ పాలన లేకుండా ఆర్టీసీ బస్సురావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రా వుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆర్టీసీ బస్సు విద్యార్థులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా ఒడ్యాడ్ రూట్ లోని వెంకట్రావు పేటకు వెళ్లి బస్సు నిత్యం ఆలస్యంగా వస్తుoడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో పాఠశాల అయిపోగా ఆరున్నర వరకు ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు తమ గ్రామాలకు వెళ్లడం ఆలస్యం అవుతుండటంతో అటు కుటుంబ సభ్యుల్లో ఇటు విద్యార్థుల్లో ఆందోళనలు మొదలైంది.
పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కు బస్సులు ఆలస్యం కావడం వల్ల చదవడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి రోజు సమయం ప్రకారం బస్సు పంపించాలని డిమాండ్ చేశారు.






