7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ పర్యటన

18-01-2025 01:38 PM

మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) శనివారం పర్యటించారు. ఆలయ భూములు కబ్జా చేస్తున్నారన్న ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ పర్యటన కొనసాగింది. ఈ సందర్బంగా వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను ఆయన పరిశీలించారు. ఆలయ భూములు కబ్జా అవుతున్నాట్లు ఫిర్యాదు మేరకు ఆయన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారుల(Revenue Officers)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా జరుగుతుంటే పట్టించుకొని అక్కడి అధికారులపై కమిషనర్ రంగానాథ్ మండిపడ్డారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు కమిషనర్ కు తెలిపారు. దీంతో హైడ్రా కమిషనర్ కబ్జా చేసిన వ్యక్తులపై కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశించారు.