17-11-2025 08:32:22 AM
హైదరాబాద్: గచ్చిబౌలిలోని(Gachibowli) సంధ్య కన్వెన్షన్ దగ్గర అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra demolition) కూల్చివేసింది. అనుమతులు లేని షెడ్లు, కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. సర్కార్ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్యా కన్వెన్షన్ హాల్(Sandhya Convention Hall) నిర్వాహకులపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా ఫోర్స్ భారీ క్రేన్లతో నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ముందస్తుగా పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అక్రమ కట్టడాలను తొలగిస్తోంది. నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది.