8 June, 2026 | 7:55 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు

11-04-2026 01:55 AM

అంజనాద్రి నగర్‌లో రోడ్డు ఆక్రమణ రేకులు నేలమట్టం 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బాధితుల కృతజ్ఞతలు

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 10: నగర శివారులోని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నాగోల్ సర్కిల్.. పెద్ద అం బర్ పేట్ 52 డివిజన్, కుంట్లూరు .. అంజనాద్రి నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చి వేతలు చేపట్టారు.

సర్వే నంబర్ 204, 208 లలో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు తమ ప్లాట్లను, సంబంధిత రోడ్లను ‘గురు కృష్ణ డెవలప్ మెంట్ ’ వారు కబ్జా చేస్తున్నారని అంజనాద్రి నగర్ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న హైడ్రా ఏసీపీ , సీఐ, సిబ్బంది కబ్జాకు గురైన రోడ్డును, ప్లాట్లను పరిశీలించారు.

రెండు వర్గాల వారి వాదనలు విన్న హైడ్రా అధికారులు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని హైడ్రా ఆఫీస్ కి రావాలని వారికి సూచించి వెళ్లారు. గురువారం ఫిర్యాదు దారులు తమ ప్లాట్లకు సంబంధించిన పేపర్లతో హైడ్రా ఆఫీస్‌కు వెళ్లి కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు.

బాధితుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ సంబంధిత రెవెన్యూ, హెచ్ ఎండీఏ అధికారులను హైడ్రా ఆఫీస్‌కు పిలిపించారు. ప్లాట్లకు వెళ్లే రోడ్డును ఆక్రమిం చినట్లు గుర్తించి వెంటనే తొలగించాలని హైడ్రా అధికారులను ఆదేశించడంతో సీఐ సైదులు శుక్రవారం సిబ్బందితో వచ్చి రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అంజనాద్రి నగర్ ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆక్రమణ జరిగినట్లు గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్న రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్లాట్లు తమకు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.