కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
వెలుగుమట్ల బాధితులకు రూ.లక్ష పరిహారం చెల్లించాలి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం లో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన బాధితులకు అదే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వెలుగుమట్ల వాస్తవ నిజ నిర్ధారణ కమిటీ చైర్మ న్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెండు వేల మంది పోలీసు బలగాలతో అమానవీయంగా సుమారు 730 ఇండ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాస్తవ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు విఠల్ అనురాధ, నరేష్, నూర్జహాన్, ప్రసాద్, రాంబాబు, మల్లే ష్ తదితరులతో కలిసి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కూల్చివేసిన ఇండ్లను మార్చి18న తమ నిజనిర్ధారణ కమిటీ సభ్యులతో కలిసి సందర్శిం చామని తెలిపారు.
కూల్చివేతకు గల కారణాలను బాధితులను కలిసి తెలుసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు దారి తీసిన అంశాలపై వివరణ కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వమే బాధితులను కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలి లేదా ఇల్లు నిర్మించుకోవడానికి తగినంత ఆర్థిక సహాయాన్ని అంది చాలన్నారు. ఈ ఘటనలో ఇల్లు కోల్పోయిన ప్రతి బాధితుడికి రూ. లక్ష రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. వెలుగుమట్ల గ్రామలో కూల్చివేసిన ఇండ్లపై తమ నిజనిర్ధారణ కమిటీ చేసిన వాస్తవ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.




