13 May, 2026 | 4:51 AM

బాలీవుడ్ లో 'సహాయ నిరాకరణ'.. కంగనా రౌనత్ వ్యాఖ్యలు వైరల్

28-08-2024 02:39 PM

ముంబాయి:  సహాయ నిరాకరణ ఉద్యమం ఎవరెవరికి ఎలా అర్థం అయిందో కానీ బాలీవుడ్ లో మాత్రం నిరాటంకంగా సాగుతోందని నటి కంగన రౌనత్ అంటున్నారు. టాలెంట్ ఉన్నవారిని తొక్కేయడమే లక్ష్యంగా తమ పీ ఆర్ లతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిపై   రూమర్లను ప్రచారం చేస్తారన్నారు. అలా ట్రోలింగ్ న్యూస్ తో  దారుణంగా అవాస్తవాలు ప్రచారం చేస్తారు. ఇండస్ట్రీ  బహిష్కరించే పరిస్థితులు కల్పిస్తారన్నారు. తాను ఇలాంటి కుట్రలు చాలా ఎదుర్కున్నానని కంగనా వివరించారు.  

 'ఎమర్జెన్సీ'లో ఇందిరాగాంధి.. కంగనా రౌనత్

మాజీ ప్రధాని ఇందిరాగాంధి రాజకీయ జీవితం  ఆధారంగా తెరకెక్కతున్న చిత్రం "ఎమర్జెన్సీ"లో కంగనా రౌనత్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన  ఈ సినిమా సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనున్నది.