30 May, 2026 | 11:21 AM

ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్

30-05-2026 10:40 AM

హైదరాబాద్: నార్సింగి సమీపంలోని 60 ఎకరాల ముష్కిన్ చెరువులో( Mushkin cheruvu) హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. రియల్టర్ల ఆక్రమణలో ఉన్న షేడ్లను హైడ్రా అధికారులు తొలగించారు. ఎఫ్ టీఎల్ చుట్టూ ఉన్న షెడ్లను ఖాళీ చేయాల్సిందిగా నెలరోజుల క్రితం హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. బడా నిర్మాణ సంస్థలు నిర్మాణ వ్యర్థాలు, మట్టిపూసి చెరువు స్వరూపాన్నే మార్చేశాయి. 60 ఎకరాల చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురికాగా, అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు శనివారం నాడు చెరువు చుట్టూ కంచె వేస్తున్నారు.

ముష్కిన్ చెరువు ఎఫ్ టీఎల్ పరిధి 52.20 ఎకరాలు, చెత్తను వేరే చేసే యూనిట్లకు అద్దెకు ఇచ్చి చెరువును వ్యాపారులు మురికికూపంగా మార్చారు. చెరువులో పరధిలో తమ భూమి 18 ఎకరాలు ఉందని పయనీర్ సంస్థ తెలిపింది. ముష్కిన్ చెరువు ఎఫ్ టీఎల్ వద్ద 12 ఎకరాల భూమి తమదని రైతులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులు ముష్కిన్ చెరువు వద్ద 4.20 ఎకరాలు తమవిగా చెప్తున్నారు. బఫర్ జోన్ తో కలిపి మొత్తం ముష్కిన్ చెరువు 62 ఎకరాలని హెచ్ ఎండీఏ తేల్చింది. నిర్మాణ సంస్థ వరద నీరు రాకుండా కాలువను మూసేసి ప్రవారీ గోడ నిర్మించిందని అధికారులు పేర్కొన్నారు.