13 March, 2026 | 12:19 AM

రెండో రోజు కొనసాగిన మహిళా క్రీడోత్సవాలు

12-03-2026 01:48 AM

రేపు మహిళా దినోత్సవ వేడుకలు : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్చెరు, మార్చి 11: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఎమ్మెల్యే జిఎంఆర్, గూడెం యాదమ్మతో కలిసి స్వయంగా వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు పట్టణం వేదికగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం కుటుంబ నిర్వహణ, ఉద్యోగం వంటి బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉండే మహిళల కోసం క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈనెల 12వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని మహిళలందరూ వేడుకల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, హారిక విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.