calender_icon.png 14 February, 2026 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటింగ్ కేంద్రం వద్ద హైడ్రామా

14-02-2026 01:02:05 AM

అలియాబాద్‌లో బీఎస్పీ అభ్యర్థి మద్దతు కోసం కాంగ్రెస్ నేతల ప్రయత్నం

మేడ్చల్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం హైడ్రా మా జరిగింది. అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ ఎని మిది, బీఆర్‌ఎస్ ఏడు, బీజేపీ మూడు వార్డు ల్లో గెలుపొందగా, బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. హం గ్ ఏర్పడటంతో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ ఏర్పడింది.

దీంతో బీఎస్పీ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీపడ్డాయి. బీఎస్పీ అభ్యర్థి వెంకటేష్‌ను కాంగ్రెస్ నాయకులు బలవంతంగా కారులో ఎక్కించడానికి ప్రయత్నించగా వారిని తోసేసి కౌం టింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంకటేష్‌కు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంతో బీఎస్పీ బీఫారం తెచ్చుకొని బరిలో నిలిచి విజయం సాధించాడు. కాగా ప్రస్తుతం బీఎస్పీ, స్వతం త్ర అభ్యర్థులద్దిరు కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ట్లు ప్రచారం జరుగుతోంది.