14-02-2026 01:00:36 AM
మేడ్చల్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన బుట్టెంగారి మాధవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందారు. మేడ్చల్ జిల్లా మూ డు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ పదోవార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాధవరెడ్డి బరిలో నిలిచారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మేరుపాటి గోవర్ధన్‌రెడ్డి చేతిలో 84 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థికి 450 ఓట్లు రాగా, మాధవరెడ్డికి 366 ఓ ట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డికి కేవలం 7 ఓట్లొచ్చాయి. బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం జీవో జారీచేయగా, దీనిని సవాల్‌చేస్తూ మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది.