గొర్రెల మందపై హైనా దాడి?
65 గొర్రెలు మృతి, మరో 20 గొర్రెలకు గాయాలు
హైనా లేదా తోడేళ్లుగా అనుమానం
సిద్దిపేట రూరల్, మే 23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మం డలం మాచాపూర్ గ్రామంలో గుర్తు తెలియని అడవిజంతువు దాడికి 65 గొర్రెలు మృతిచెందగా మరో 20 గొర్రెలు గాయపడిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరి పున్నం మల్లయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. రోజువారిగానే గొర్రెలను జాలి (దొడ్డి)లో తోలాము. ప్రతి రోజు రాత్రి కావలిగా వచ్చి పడుకుంటాము. కాని నిన్న రాత్రి 12గంటల వరకు తమ కుమారుడు ఉన్నాడని, తాను తెల్లవారు జామున 4గంటల ప్రాంతానికి గొర్రెల దగ్గరకు రావడంతో జాలితో కొన్ని గొర్రెలు అరుస్తు ఆగమాగం చేస్తున్నాయి.
ఏమైందని లోపలికి వెళ్లగానే ఒక జంతువు జాలిలోనుంచి బయటకు దూకి వెళ్లింది. అక్కడ ఉన్న పరిస్థితి గమనించగా గొర్రెలు చిందరవందరగా పడి ఉన్నాయి. కొన్ని గొర్రెలు కొట్టుకుంటున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయగా అందరు అక్కడికి చేరుకున్నారు. పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పశువైద్యాధికారి మంజుల పరిశీలించి 65 గొర్రెలు మృతి చెందినట్లు, మరో 20 గొర్రెల వరకు గాయపడ్డాయని నిర్థారించారు.
గాయపడిన గొర్రెలకు చికిత్స చేసి గాయాలకు కుట్లు వేశారు. తమ జీవనోపాధి అయిన గొర్రెలు మరణించటంతో తాము ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని గొర్రెలు పోయి శోకం మిగిలిందని కుటుంబీకులు బోరున విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సంఘటన స్థలానికి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హరీశ్ చేరుకొని పంచనామ నిర్వహించారు.
కెమెరా ట్రాప్, బోన్ ఏర్పాటు చేస్తాం
అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమీపంలో ఉన్న జంతువుయొక్క అడుగుల గుర్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ విక్రమోద్దీన్ మాట్లాడు తూ గుర్తు తెలియని అడవి జంతువు దా డి జరిగింది. ఈ రోజు ఇక్కడ కెమెరా ట్రాప్, బోను ఏర్పాటు చేస్తాము. ఇలాం టి ఘటనలు జరిగిన ప్రదేశాల్లో ఆ జం తువు మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.
కెమెరా ట్రాప్ ద్వారా తెలుసునే అవకాశం ఉంది. అదే విధంగా గొర్రెలను తోలే దొడ్డికి కొంత భద్రత ఉండేలా చూసుకోవాలని సూచించారు. సేకరించిన అడుగుల గుర్తులను పరిక్షించి దాడి చేసిన జంతువు ఏదనేది నిర్దారించి తెలుపుతామన్నారు. రైతులకు ఏదైనా అనుమానాస్పద జంతువులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య తెలిపారు.
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ విక్రమోద్దీన్






