ఈదురు గాలుల బీభత్సం
24-05-2024 02:02 AM
పాపన్నపేట, మే 23 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలుల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పాడింది. మండల కేంద్రంలో చెట్ల కొమ్మలు ఇంటిపై పడి ఇళ్లు కూలిపోయింది. ఈదురు గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. వృక్షాలు విద్యుత్ స్తంభాలపై పడటంతో స్తంభాలు విరిగిపోయి రోడ్డుపై పడ్డా యి. దీంతో మండల వ్యాప్తంగా విద్యత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.






