16 August, 2026 | 5:14 PM

శివసాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవం

16-08-2026 04:32 PM

అధ్యక్షులుగా ప్రభాకర్ రావు,కార్యదర్శిగా శ్రీధర్ 

కమిటీని అభినందించిన కాంగ్రెస్ నాయకులు మట్టా

సత్తుపల్లి ఆగస్టు16(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం 5వ వార్డుకు చెందిన శివసాయి నగర్ కాలనీలో ప్రజలు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కాలనీ స్థాపించి 25 సంవత్సరాలు అయినప్పటికీ సమస్యలు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండటంతో,ఈ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఒక కమిటీ ఉంటే బాగుంటుందని,ఆలోచన చేసి శివ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా సిహెచ్. ప్రభాకరరావు, గౌరవ అధ్యక్షులుగా జి జగన్నాధ రావు,ఉపాధ్యక్షులుగా డి సింధుజ, ప్రధాన కార్యదర్శిగా బి  శ్రీధర్, కోశాధికారిగా మరీదు రాము, సహాయ కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శులుగా ఎం నాగబాబు, ఎం మోహన్,సిహెచ్ సందీప్, డి.ధర్మయ్య,డి లక్ష్మణరావు, సిహెచ్ సందీప్ , వై.యువరాజు ,ఎం సత్యవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ  విధానంగా ఎన్నికైన నూతన కమిటీని  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, వార్డ్ కౌన్సిలర్ , ఎస్ కె.హకీమ్ అభినందించారు. శివ సాయినగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శివ సాయి నగర్ కాలనీలో ఉన్న సమస్యలను గూర్చి శనివారం నాడు బింగి కన్నా రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివసాయినగర్ స్త్రీలు వినతి పత్రం అందజేయగా,సానుకూల స్పందించి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు,యువత, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.