16 August, 2026 | 5:34 PM

ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా చేస్తాం

24-05-2024 02:00 AM

మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్

నర్సాపూర్, మే 23 : నర్సాపూర్ మున్సిపాలిటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్‌గౌడ్ అన్నారు. గురువారం మున్సిపాలిటి పరిధిలోని 13వ వార్డులో చైర్మన్ అశోక్‌గౌడ్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. నర్సాపూర్ మున్సిపాలిటిని మెదక్ జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి వార్డుల్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు.