24 August, 2026 | 10:49 AM

Breaking News

డెంగ్యూ ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలి

21-06-2025 01:23 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): డెంగ్యూ ప్రబలకుండా పరిశు భ్రత పాటించాలని జీమెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నగరవాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరా పార్కులను ఆయన సంద ర్శించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు.

కవాడిగూడ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కమిషనర్ ఇందిరాపార్కు ను సందర్శించారు. అక్కడ వాకర్స్‌తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ సమన్యలను పరిష్కరించాలని యూబీడీ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సందర్శకుల వసతుల కోసం కొన్ని కమిషనర్ సూచనలు చేశారు. పార్కు మొత్తం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా నిరోధించాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూ టీ కమిషనర్ రామానుజులరెడ్డి ఉన్నారు.