నేనూ హాస్టల్‌లోనే చదువుకున్నా
10-12-2024 01:57 AM
మంత్రి సీతక్క
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కుటుంబానికి దూరంగా ఉంటూ హాస్టల్లో ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదని, తానూ హాస్టల్లోనే ఉండి చదువుకున్నానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం వెంగళరావునగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించారు.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థినులకు తినిపించారు. సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వమందించే అవకాశాలను వినియోగిం చుకోని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని చెప్పా రు. అనంతరం వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌నూ సందర్శించారు.






