3 September, 2026 | 12:34 PM

మంచు ఫ్యామిలీలో వీడని ఉత్కంఠ

10-12-2024 | 01:54am
  • సయోధ్య కుదుర్చేందుకు మంచు లక్ష్మీ యత్నం
  • వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో తండ్రీకొడుకుల పరస్పర ఫిర్యాదులు

మహేశ్వరం/ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9(విజయక్రాంతి): మంచు ఫ్యామి లీలో తండ్రీకొడుకుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారు తోంది. తండ్రి మోహన్‌బాబు తనపై దాడి చేశాడని మనోజ్ ఈ నెల 8న డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చిన విష యం తెలిసిందే. అయితే జల్‌పల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఉదయం బయటకు వెళ్లిన మోహన్ బాబు రాత్ర యినా తిరిగి రాలేదు. ఇంట్లో మనోజ్‌తో పాటు ఆయన తల్లి మాత్రమే ఉన్నారు.

ఉదయం మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీప్రసన్న ముంబై నుంచి జల్‌పల్లికి వచ్చి మూడు గంటల పాటు కుటుంబసభ్యులతో చర్చించారు. మనోజ్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్ మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మనోజ్ అన్న మంచు విష్ణు వ్యాపార భాగ్యస్వామిగా ఉన్న విజయ్ ఈ హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్న మంచు విష్ణు మధ్యాహ్నం జల్‌పల్లికి వస్తారన్న ప్రచారం జరిగింది.

మోహన్‌బాబు వ్యక్తిగత వ్యవహారాలు చూసే ప్రశాంత్‌ను ఏదో విషయమై మనోజ్ మందలించడంతో మోహన్‌బాబు మనోజ్‌పై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సాయంత్రం 6 గంటల తర్వాత పహాడీ షరీఫ్ పీఎస్‌కు వచ్చిన మనోజ్ ఈ నెల 8న తమ ఇంట్లో 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీభత్సం సృష్టించారని ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తనపై దాడి చేశారని వెల్లడించారు.

ఘటన సమయంలో కిరణ్‌రెడ్డి, విజ య్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారు సీసీ ఫుటేజీలను సైతం మాయం చేశారని పేర్కొన్నారు. కాగా మంచు మనోజ్, అతడి భార్య మౌనిక ఇద్దరు కలిసి వారి వ్యక్తిగత అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతూ, తన ఆస్తులను జప్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంచు మోహన్‌బాబు సోమవారం రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.