హక్కుల సాధనకై ఆదివాసీల పోరు
* తుడుందెబ్బ రాష్ర్ట కో కనీనర్ గణేశ్
* మరో ఇంద్రవెల్లి పోరాటానికి తీర్మానం
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఆదివాసీలు తమ హక్కుల సాధన కో సం మరోమారు పోరుబాట పట్టనున్నారు. ప్రధానంగా చట్టబద్ధతలేని లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలి ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసిన ఆదివాసీలు.. తాజాగా ఇంద్రవెల్లి ఉద్యమస్ఫూర్తితో మరొక ఇంద్రవెల్లి ఉద్యమానికి సిద్ధం కావాలని తీర్మానించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), గోండ్ వాన పంచాయతీ రాయిసెంటర్స్ పరిధిలోని 9 తెగల కుల సంఘాల ఆధర్యంలో సోమవారం ఏకాగ్రీవ తీర్మానం చేశారు.
ఇంద్రవెళ్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన ఆదివాసి అస్తిత పోరుగర్జన సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. తుడుం దెబ్బ రాష్ర్ట కో కనీనర్ గోడం గణేశ్ మాట్లాడుతూ.. లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను 9 తెగల ఆదివాసులతోనే భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవాలన్నారు.
గుడిసెలు వేసుకుని నివాసముంటున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి, విద్యా, వైద్య, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుతాలు పరి ష్కరించకుంటే ఏప్రిల్ 10, 2025 నుంచి పో రాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.






