30 July, 2026 | 2:49 AM

నేనూ రియల్ ఎస్టేట్ బాధితుడినే!

29-05-2024 01:43 AM

సినీ నటుడు జగపతిబాబు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ప్రజలకు సూచించారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించి తానూ బాధితుడినేనని వాపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జగపతిబాబు మంగళవారం ఓ పోస్టు చేశారు. ఇటీవల తాను ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించానని, అయితే తనకు మోసం జరిగిందని తెలిపారు. నన్ను మోసం చేసిన వాళ్లు ఎవరు..? ఎలా జరిగింది..? అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. భూములు, స్థలాలు కొనుగోలు చేసేముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు.