30 July, 2026 | 3:49 AM

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తగదు

29-05-2024 01:42 AM

నర్సాపూర్, మే 28: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల మల్లేశ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ గ్రంధా లయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం తగదన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో తీవ్రంగా నష్టపో యామని గ్రహించిన ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేశారన్నారు.

ఆయనను విమర్శించే స్థాయి వారికి లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, కన్నతల్లి లాంటి పార్టీని ఆమె వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వినోద, ఎంపీటీసీ లక్ష్మిఅశోక్, మండల మైనారిటీ సెల్ అధ్య క్షులు అజ్మత్, కాంగ్రెస్ నాయకులు యాదా గౌడ్, దేవీసింగ్, మోహన్‌దాస్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.