31 March, 2026 | 2:38 AM

ఆ పాత్రకు వెండితెరపై ప్రాణం పోయబోతున్నా..

31-03-2026 12:16 AM

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రానుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్, కే నారాయణ, హీరో యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయన సరసన కియారా.. ‘నాదియా’ పాత్రలో రొమాన్స్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పోస్టర్లు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.

ఇదిలావుండగా, కియారా తాజాగా ఓ ఇంట ర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ‘టాక్సిక్’లో తన పాత్ర గురించి వివరించింది. “నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్టుల్లో ‘నాదియా’ పాత్ర చాలా విభిన్నమైనది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ క్యారెక్టర్‌ను రాసిన విధానం, ఆమె ప్రయాణాన్ని తీర్చిదిద్దిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాత్రను నేను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా.

గీతూ విజన్ ప్రకారం ఈ పాత్రకు వెండితెరపై ప్రాణం పోయడానికి నేను సిద్ధంగా ఉన్నా” అంటూ సినిమాపై ఆసక్తి రేకెత్తేలా చేసింది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో కియారా ఈ ప్రాజెక్టుపై చాలా నమ్మకంగా ఉంది. ఇక ఈ చిత్రంలో నయనతార, హ్యూమా ఖురేషి వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.