సూరికి జోడీగా..!
మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ‘ప్రేమలు’ మూవీ ఇచ్చిన సెన్సేషనల్ సక్సెస్‌లో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘డ్యూడ్’ చిత్రంతో కూడా విజయాన్ని అందుకుని టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’లో ఒక కీలక పాత్రలో నటించిన మమిత.. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.
కమెడియన్ నుంచి హీరోగా మారి వరుస విజయాలు అందుకుంటున్న సూరి హీరోగా దర్శకుడు రవికుమార్ ఓ భారీ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారు. ప్రస్తుతానికి ‘సూరి-7’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ఇప్పుడు మమిత ఎంట్రీతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డైరెక్టర్ రవికుమార్ గతంలో ‘నేట్రు ఇండ్రు నాలై’ (తెలుగులో ‘నిన్న నేడు రేపు’) వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు సూరి లాంటి మాస్ హీరోతో కలిసి ఆయన చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో మమిత పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.
సూరి పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోవడం మమిత కెరీర్‌కు మంచి మలుపు అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం. ఇక మమిత ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో కూడా నటిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.




