18 March, 2026 | 5:03 AM

డ్రగ్ టెస్టుకు నేను రెడీ రేవంత్‌రెడ్డి డ్రగ్ టెస్టుకు సిద్ధమా?

18-03-2026 01:53 AM

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): డ్రగ్ టెస్టుకు తాను రెడీ, డ్రగ్ టెస్టు కు తానెప్పుడూ సిద్ధమే అని, డ్రగ్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్‌ది నామినేటెడ్ పదవి అని, మాది ఎలెక్టెడ్ పదవన్నారు. బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మంగళవారం ఆయన చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా డ్రగ్ టెస్టుకు ప్రజాప్రతినిధులందరూ ముందు కు రావాలన్నారు. నేడు 63వ మూట కట్టుకొని ఢిల్లీకి సీఎం పోతున్నారని ఆరోపించారు. తమది తెలంగాణ అని, ఏపీ రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

ఫా మ్‌హౌస్‌లను కూల్చివేస్తేనే డ్రగ్ పార్టీలను అరికొట్టొచ్చన్నారు. ఫామ్ హౌజ్ కల్చర్ తెచ్చిందే బీఆర్ ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమమని చెప్పిన రేవంత్ ఇప్పుడెందుకు దాన్ని కూల్చడంలేదని, కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పంది ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పతనానికి కవిత చాలని, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వృద్ధాశ్రమంగా మారిందని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.