14 August, 2026 | 8:20 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

వర్సిటీ ప్రారంభోత్సవ ఆహ్వానానికే వచ్చా

25-04-2026 12:03 AM
  1. మా మామయ్య పోటీ చేయమంటే నేను రెఢీ
  2. బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తాను బీజేపీ పార్టీలో చేరడం లేదని, ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం ఇచ్చేందుకే బీజేపీ కార్యాలయానికి వచ్చానని, ఎంపీ టికెట్ కోసం కాదని మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం తమ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే కార్యాలయానికి వచ్చానని తెలిపారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన ఆమె రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాల గురించి మాట్లాడట్లేదని, ప్రస్తుతం తాను విద్యా వ్యవస్థ కోసం పాటుపడుతున్నానని, రేపు ఏదైనా జరగొచ్చని చెప్పారు. ‘హిందూ పండుగలను తాను సెలబ్రేట్ చేసుకుంటాను అంతమాత్రాన బీజేపీ కోసం పాటుపడుతున్నట్లు కాదు కదా’ అన్నారు.

రాజకీయాల గురించి ఆలోచించట్లేదన్నారు. మా మామయ్య రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన పోటీ చేయమంటే పోటీ చేసేందుకు రెఢీ’ అన్నారు. తాను అన్ని పార్టీల నాయకులను కలుస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానిం చేందుకు ఇటీవల వెళ్లినట్లు తెలిపారు.

మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ఆమె పేర్కొ న్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని మల్లారెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ కార్యాలయానికి వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును కూడా ప్రీతిరెడ్డి కలిశారు.