25 April, 2026 | 1:41 AM

ఉపాధి కూలీల సంక్షేమం దిశగా చర్యలు

25-04-2026 12:04 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులలో ఉపాధి హామీ కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని భీమిని మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగామోహన్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి చేరుకొని 11 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, పని ప్రదేశాలలో నీడ, త్రాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రహదారులు,  నిబంధనల ప్రకారం వ్యక్తిగత సంబంధిత పనులు మంజూరు చేస్తామని, కూలీలు 100 రోజుల పని పూర్తి చేసుకోవాలని కోరారు. గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 90 రోజుల పని దినాలను ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించడం జరుగుతుందన్నారు.

అవసరం ఉన్నవారు ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, ఫారం పాండ్లు, చేపల చెరువులు వంటి పనులను మంజూరు చేస్తామన్నారు. పనుల నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న భీమిని, బిట్టూరుపల్లి, చిన్న గుడిపేట క్షేత్ర సహాయకులు లీలావతి, సాయిరాం, సత్యనారాయణలను శాలువాలతో సత్కరించి నగ దు బహుమతి అందజేశారు. మండల కేం ద్రంలోని పీహెచ్‌సీ సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సా ధారణ ప్రసవాలు, సిజేరియన్ల వివరాలు తెలుసుకొని వైద్యులకు పలు సూచనలు చేశారు. మండల తహ సిల్దార్ కార్యాలయా న్ని సందర్శించి తహసిల్దార్ బికర్ణదాస్‌తో కలిసి హాజరు పట్టిక, భూభారతి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయు తంగా వ్యవహరించాలని, భూ భారతి రెవె న్యూ సదస్సులోని దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి రికార్డులతో సరిచూసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.