15 June, 2026 | 2:19 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

మింగలేక మంగళారం..

20-02-2026 01:48 AM

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేశ్’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లు. ఈ చి త్రంలో మురళీధర్‌గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ‘మింగలేక మంగళారం’ అనే పాటను మేకర్స్ గురువారం విడుదల చేశారు.

సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ఈ పాటను తరుణ్ సైదుల్ రాయగా, బిత్తిరి సత్తి ఆలపించారు. ‘మింగలేక మంగళారం అన్నట్టయ్యింది రా..’ అం టూ సాగుతున్న ఈ పాట మల్లేశ్ క్యారెక్టర్ గురించి చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పూర్ణాచారి, అనిరుధ్ శాండిల్య మారంరాజు, తరుణ్ సైదులు; డీవోపీ: అమ్మముత్తు; ఎడిటర్: గ్యారీ దీ.