calender_icon.png 15 November, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడ్కోలు నిర్ణయం తట్టుకోలేకపోయా

22-12-2024 12:30:11 AM

అశ్విన్ భార్య ప్రీతి నారయణన్

చెన్నై: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అంశంపై అతడి భార్య ప్రీతి నారాయణన్ తొలిసారి స్పందించింది. సా మాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘అశ్విన్ వీడ్కోలు నిర్ణయం తట్టులేకపోయా. ఇన్నాళ్లు గ్రౌండ్‌లో కనిపించిన అశ్విన్ ఇకపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఏదో తెలియని వెలితి. రెండు రోజుల నుంచి ఏం దిక్కు తోచకుండా ఉంది. అభిమాన క్రికెటర్ గురించి చెప్పాలా? లేక జీవిత భాగస్వామి కోణంలో చెప్పాలా అన్నది తేల్చుకోలేక పోతున్నా. అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌లో సాధిం చిన విజయాలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవా ర్డులు, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం , 2020 ఆసీస్ పర్యటనలో చారిత్రక మెల్‌బోర్న్, గబ్బా విజయాలు, టీ20ల్లో రీఎంట్రీ చాలా సంతోషం కలిగించాయి. క్రికెట్‌కు, కుటుంబానికి అశ్విన్ సమాన విలువనిచ్చాడు’ అని ప్రీతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నైకి ఆడనున్నాడు.