11 April, 2026 | 7:52 PM

మానవతకు ప్రతీక మహాత్మా జ్యోతి రావు పూలే

11-04-2026 06:07 PM

మోతె,(విజయక్రాంతి): మానవతకు ప్రతీక మహాత్మా జ్యోతి రావు పూలే అని పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ పల్లెల అన్నారు. శనివారం మండల కేంద్రంలో  పల్లెల పరివర్తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి రావు పూలే రెండు వందల జయంతి సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజ్యంలో సకల రుగ్మాతులకు చదువు ఒక్కటే మార్గమని చదువు ద్వారా దేనినైనా సాధించ వచ్చునని  మార్పు తన కుటుంబం నుంచే మొదలు పెట్టి తన భార్య సావిత్రి భాయి పూలేని దేశంలో మొదటి పంతులమ్మను చేసిన గొప్ప సంఘ సంస్కార్త అని చెప్పారు.