నూతన ఎస్ఐ మహేందర్ ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
11-04-2026 06:03 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల ఎస్ఐ మహేందర్ ను బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు గ్రామంలో గల పలు సమస్యల గురించి చర్చించారు. ఆదివారం జరిగే వారంతపు సంతలో ట్రాఫిక్ సమస్యల పై నాయకులు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు తెలిపారు.




