23 May, 2026 | 6:01 AM

నాకంటూ ఏ ఫాం హౌజ్ లేదు.. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా

21-08-2024 02:32 PM

హైదరాబాద్‌: తన పేరు మీద ఫామ్‌హౌస్ లేదని, జన్వాడలో ఉన్న ఫాంహౌస్ తన స్నేహితుడిదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తెలిపారు. కేటీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో నీటి వనరుల ఎఫ్‌టిఎల్‌పై నిర్మించిన జన్వాడలోని తన ఫామ్‌హౌస్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ, నా పేరు మీద ఫామ్‌హౌస్ లేదు, నేను నా ఫామ్‌హౌస్ నుండి జన్వాడలోని ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నాను. ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చివేస్తాం కానీ.. చెరువుల్లో కట్టుకున్న మంత్రుల ఫాం హౌజ్‌ల సంగతి ఏంది?,  చెరువుల్లో కట్టుకున్న బడా కాంగ్రెస్ నాయకుల ఫాం హజ్‌లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదా?. అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న నిర్మాణాలపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్రమ నిర్మాణాలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, మండలి చైర్మన్‌ జి. సుఖేందర్‌రెడ్డి తదితరులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.