మెలోడీస్ అంటే ఇష్టం.. అదే నా బలం!
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు నాగ వంశీ విలేకరులతో పంచుకున్న ఈ సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
* మాది హనుమకొండ. మా నాన్న రాఘవేందర్ ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. అక్కడ మాకు రికార్డింగ్ స్టూడియో ఉంది. మా నాన్న దగ్గర నేను కీబోర్డ్ నేర్చుకున్నా. షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నప్పుడు సుభాష్‌తో పరిచయమయ్యింది. మొదట ‘క్లౌడ్ నైన్’ అనే షార్ట్ ఫిలిమ్‌కు అవకాశమిచ్చారు. తర్వాత ‘పెళ్లి పుస్తకం’, ‘ప్రయాణం’ లాంటి షార్ట్ ఫిలిమ్స్‌కు కూడా పనిచేశా. -
భవిష్యత్తులో సినిమా చేస్తే తప్పకుండా కలిసి పనిచేద్దామని సుభాష్ అప్పుడే చెప్పారు. అలా నాకు ‘గోదారి గట్టుపైన’ సినిమా అవకాశం వచ్చింది. ఇంకా నేను సాయి కార్తీక్, అనుప్ రూబెన్స్, జీవీ ప్రకాశ్, జస్టిన్ ప్రభాకర్‌ల దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేశాను. వారందరి దగ్గర పని చేయడం వల్ల మంచి అనుభవం వచ్చింది.
* సుభాష్ సినిమాలన్నీ ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా చాలా క్లీన్‌గా ఉంటాయి. ఈ ‘గోదారి గట్టుపైన’ కూడా అలాగే వుంటూనే మంచి కమర్షియల్ టచ్ కూడా ఉంది. ఆయన కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఆయన అద్భుతమైన సిచువేషన్స్ చెప్పారు. దానికి తగ్గట్టు మ్యూజిక్ చేశా. అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందులో బ్రేకప్ యాంథమ్‌తోపాటు చిత్ర, ఎస్పీ చరణ్ పాడిన పాటలకు మంచి స్పందన రావడం చాలా ఆనందాన్నిచ్చింది.
* ఇందులో బిట్ సాంగ్స్ కలిపి మొత్తం 7 పాటలున్నాయి. అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఒక రెట్రో సాంగ్ సిచువేషన్ ఉంది. దానికి సీనియర్ సింగర్స్ పాడితే బాగుంటుందని సుభాష్‌తో చెప్పా. అలా చిత్ర, చరణ్ పాడారు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. చిత్ర ట్యూన్ విని మెచ్చుకున్నారు. అలాంటి గొప్ప సింగర్స్ పాడటం వల్ల పాటకు మరింత విలువ పెరిగింది.
* ఈ సినిమాలో -ఒక ఎమోషనల్ సాంగ్ కోసం ట్యూన్ క్రాక్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. చివరకు మంచి ట్యూన్ వచ్చిం ది. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ పాటను కాలభైరవ పాడారు.
* అభినవ్ చాలా పాషన్ ప్రొడ్యూసర్. మ్యూజిక్ కోసం కావలసిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా అందించారు. ఈ సినిమా కోసం లైవ్ స్ట్రింగ్స్ ఉపయోగించాం. అవి చాలా ఖరీదైనవి. సాధారణంగా పాటల కోసం వాడడం కష్టం. కానీ ఆయన మేము అడిగిన ప్రతిదీ సమకూర్చారు.
* ఇళయరాజా నాకు స్ఫూర్తి. ఆ తర్వాత రెహమాన్, మణిశర్మ, హరీశ్ జయరాజ్ అంటే కూడా చాలా ఇష్టం. -నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టం. అదే నా బలం అని భావిస్తా. ప్రతి పాటలో ఆ మెలోడీ మిస్ కాకుండా ప్రయత్నిస్తా. ఈ సినిమా నా కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నా.






