15 June, 2026 | 8:57 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

వరుణ్ సరసన ప్రత్యేకంగా..

19-04-2026 12:12 AM

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా’ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ దర్శకుడు, కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ తండ్రీకొడుకుల జోడీ ఒక కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు రాబోతున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో పూజా హెగ్దే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ అన్ని పనులను పూర్తి చేసి, మే 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. ఈ చిత్రంలో మరో బ్యూటీ కృతి సనన్ మెరవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరుణ్ ధావన్ సరసన ఒక మాస్ మసాలా సాంగ్‌లో కృతి సనన్ స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ ప్రత్యేక గీతం కోసం మూవీటీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని, కృతి కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా.. గతంలో వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి నటించిన ‘భేడియా’ వంటి చిత్రాల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను రంజింపజేసింది. తాజా వార్తలు నిజమై, మరోసారి ఈ ఇద్దరు కలిసి ఐటం సాంగ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే మరి.