ఫస్ట్‌లుక్‌తోనే గ్లోబ్ అదిరే!
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్టును శనివారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్.. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.
ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్‌ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి రావడం ఆసక్తి కలిగిస్తోంది. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అని పోస్టర్‌పై రాసిన ఉన్న క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ ఎరిక్ డస్ట్ ఈ మూవీకి పనిచేస్తున్నారు.
యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేశ్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.






