13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పలికానే పెదాలతోనే..

22-03-2026 12:00 AM

కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్‘. ఈ సినిమాను ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ఈ చిత్రం తెలుగులో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘సఖియే..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘పలికానే పెదాలతోనే పలుమార్లు ఇలా నీ పేరే.. అలవాటే లేదాయే వెతికే మాయవి నీవేలే..’ అంటూ యువ జంట పాడుకునే అందమైన ప్రేమగీతం ఇది. జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజిషన్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సింజిత్ యెర్రమల్లి, సింధుజ తణుకు పాడారు.