26 March, 2026 | 12:31 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

ఆ పేరు పోగొట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డా..

23-10-2024 12:00 AM

నటి కృతిసనన్ తొలుత టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా బాలీవుడ్ నటిగానే ముద్ర వేసుకున్నారు. అయితే ఆమె బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినా కూడా చాలా కాలం పాటు ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’గానే పిలిచేవారు. బాలీవుడ్‌లోకి ఆమె ‘హీరో పంటి’ అనే చిత్రంతో అడుగు పెట్టారు. 2014లో వచ్చిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించారు.

ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయినా సరే తొలి సినిమా ట్యాగ్ ఆమెను వెంటాడేది. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతగానో శ్రమించా రట. ఈ విషయం తాజా గా ఓ ఇంటర్వ్యూలో కృతి వెల్లడించారు. “నేను ఎన్ని పెద్ద ప్రాజెక్టుల్లో చేసినా ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’గానే పిలిచేవారు.

సినీ నేపథ్యం లేనపుడు అ లాంటి పేర్లు పెడతారు కా నీ చివరకు ‘బరేలీ కి బర్ఫీ’ దర్శకురాలు అశ్వనీ పిల్ల లు సైతం అలాగే పిలిచేవారు. ఆ పేరు పోగొట్టు కోవడం కోసం చాలా కష్టపడ్డాను. ‘హీరో పంటి’ కం టే ముందు ‘1: నేనొక్కడినే’ చిత్రంలో నటించా. ఆ తరువాత కూడా తెలుగు సినిమాలు చేసి నా కూడా బాలీవుడ్ హీరోయిన్‌గానే పేరొచ్చింది” అని కృతి సనన్ తెలిపారు. ప్ర స్తుతం ఈమె పలు ప్రాజెక్టులకు నిర్మాతగానూ వ్యవ హరిస్తున్నారు.