calender_icon.png 18 January, 2026 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలనుంది

18-01-2026 12:01:16 AM

రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు రవితేజ మాట్లాడుతూ.. “ఎన్నో ఏళ్లుగా వర్క్ చేస్తున్న యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో కలిసి మరోసారి ఈ సినిమా కోసం పనిచేయడం ఎంత ఆనందాన్నిచ్చింది. సినిమాకి ఇంకా చాలా మంచి రన్ ఉంటుంది. డింపుల్ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది.

తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ఆషిక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా మెయిన్ క్రెడిట్ కిషోర్, భీమ్స్‌కి ఇస్తాను” అన్నారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థాంక్యూ. ఫన్ చాలా ఆర్గానిక్ అని ఉందని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది” అన్నారు. ‘అన్ని వైపుల నుంచి కూడా చాలా మంచి సినిమా అని రెస్పాన్స్ వస్తోంద’ని నిర్మాత సుధాకర్ చెప్పారు.

హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతి సక్సెస్ మీట్ మాకు ఎంతో స్పెషల్. ఇందులో చేసిన బాలమణి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్. అందరూ కూడా ఆ క్యారెక్టర్‌తో రిలేట్ అవుతున్నారు. కిషోర్ అద్భుతంగా ఆ క్యారెక్టర్‌ను రాశారు. రవితేజతో ఇది నాకు రెండో సినిమా. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్‌ని. నా ఫస్ట్ హీరో, ఫస్ట్ హిట్. ఇది ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటుంది. అది కూడా సంక్రాంతికి రావడం ఇంకా సంతోషాన్ని కలిగించింది”  ధర్‌గౌడ్, మిగతా మూవీ యూనిట్ పాల్గొన్నారు.