18-01-2026 12:00:00 AM
రోహిత్‌వర్మ హీరోగా గోవిందరెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఇందులో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హరీశ్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్‌కుమార్, దేవిప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుభోదయం సుబ్బారావు, నాగమహేశ్, తాగుబోతు రమేశ్, శంకర్ మహంతి, సురభి ప్రభావతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ని రివిల్ చేశారు. ఈ చిత్రానికి ‘పల్నాడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, రవికుమార్ వీ డీవోపీగా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.