17 June, 2026 | 11:08 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

‘నాగబంధం’లో పార్వతిగా..

18-01-2026 12:02 AM

విరాట్ కర్ణ హీరోగా నటి స్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. అభి షేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా కాగా.. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి ద శకు చేరుకుంది. మకర సంక్రాంతి సందర్భంగా చి త్ర బృందం హీరోయిన్ నభా నటేశ్‌ను పార్వతి పా త్రలో పరిచయం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో నభా నటేశ్ సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తోంది.

ఆమె ముఖంలో కనిపించే హుందాతనం, పవిత్రత, ఆత్మీయ భావం, భక్తి, పురాణాల మూలాల నుంచి పుట్టిన పాత్రను సూచిస్తోంది. భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం నాగబంధం సంప్రదాయంలోని పవిత్ర రహస్యాలను అన్వేషిస్తుంది. ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అభే, జునైద్ కుమార్; సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్; ఎడిటింగ్: ఆర్సి ప్రణవ్; ప్రొడక్షన్ డిజైన్: అశోక్‌కుమార్.