7 March, 2026 | 10:44 PM

న్యాయ చైతన్య సదస్సు

07-03-2026 09:00 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాలతో 'న్యాయ చైతన్య' సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పానెల్ అడ్వకేట్ లు మాట్లాడుతూ ఆడపిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదని తమను తాము రక్షించుకునే చట్ట బలం కూడా ఉండాలని అన్నారు.

వేధింపులను భరించడం అంటే నేరాన్ని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. అనంతరం అడ్వకేట్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు, పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్ర ప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, పానెల్ అడ్వకేట్ లు ఎస్విఆర్ కృష్ణ, బొజ్జ శ్రీలక్ష్మి, బాశెట్టి సమతా రాణి, నాజియా కుతీజా, తిరుమణి అశ్విని, బలుసుల శాంతి కుమార్ లతో పాటు కళాశాల చైర్మన్ పి. వేణు, ప్రిన్సిపాల్ కే. మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ రాధికా,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.