18-06-2025 12:00:00 AM
యష్ రాజ్ ఫిల్మ్స్, మోహిత్ సూరి కాంబోలో రూపొందుతున్న తాజాచిత్రం ‘సయారా’. ఈ సిని మాతో అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేస్తోంది వైఆర్‌ఎఫ్ సంస్థ. అనీత్ పద్దా కథానాయికగా నటిస్తోంది. అక్షయ్ విధాని నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను టీమ్ పరుగులు పెట్టిస్తోంది. ఇటీవల చార్ట్‌బస్టర్ టైటిల్ ట్రాక్ తర్వాత జుబిన్ నౌటియాల్ పాడిన ‘బర్బాద్’ గీతం కూడా బ్లాక్‌బస్టర్ అయింది.
ఇక ఇప్పుడు నిర్మాతలు మూడో పాట ‘తుమ్ హోతో’ను సైతం మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పెప్పీలవ్ ట్రాక్‌ను విశాల్ మిశ్రా ఆలపించారు. ఈ థర్డ్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘నా పాటలే విశాల్‌ను సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్ఫూర్తి నింపాయని అతను చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నా కెరీర్‌లో నేను కలిసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో విశాల్ మిశ్రా ఒకరు. సయారా మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆయన పాట పాడటం నా అదృష్టం. విశాల్ సంగీతాన్ని ఇష్టపడేవారు ‘తుమ్ హోతో’ పాటతో ప్రేమలో పడతారు” అన్నారు.