9 July, 2026 | 1:22 AM

సంబరాల ఏటిగట్టు కోసం..

17-12-2024 12:00 AM

సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. సాయిదుర్గతేజ్ 18వ చిత్రంగా నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీన్ని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయిదుర్గతేజ్ మేకోవర్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల హీరో రామ్‌చరణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ మూవీ కార్నేజ్ చూస్తే.. అందులో సాయిదుర్గతేజ్ వారియర్ లుక్ ఆకట్టుకుంటోంది. సినిమాలో క్యారెక్టర్‌కు తగినట్టు కనిపించడానికి ఆయన శ్రమించినట్టు తెలుస్తోంది. ఆహారం విషయంలో కఠిన నిబంధనలు పాటించడమే కాక శారీరాకృతి కోసం కఠినమైన కరసత్తులు చేసినట్టు అర్థమవుతోంది. తద్వారా ఈ ఇంటెన్స్ యాక్షన్ సినిమాకు పూర్తి న్యాయం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.