calender_icon.png 11 January, 2026 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ పేదోడికి ఇంటి స్థలం ఇప్పిస్తా!

11-01-2026 12:24:47 AM

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

సదాశివపేట, జనవరి 10: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్‌లో ఇందిర మ్మ ఇండ్ల స్థలాలను శనివారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించి, ఇంటి స్థలం లేని పేదోళ్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2013లో సదాశివపేట పట్టణంలో పేదలకు 182 ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. 222 మంది రైతులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు.

ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున 5,300 మందికి పట్టాలిచ్చినట్లు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ప్లాట్ల వద్దకు పట్టాదారులు వస్తే పోలీసులతో బెదిరించి వెళ్లగొట్టారన్నారు. ప్లాట్ల కోసం ఇచ్చిన 180 ఎకరాలలో 52 ఎకరాలు డబుల్ బెడ్ రూంలకు పదేళ్ళ బీఆర్‌ఎస్ హయాంలో కేటాయించారని, 50 ఎకరాల్లో కట్టిన డబుల్ బెడ్‌రూంలలో కేవలం 320 మందికి మాత్ర మే ఇచ్చారని చెప్పారు. 80 గజాల చొప్పున 50 ఎకరాల్లో 2,011 మందికి ఇవ్వొచ్చన్నారు.

హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కలిసి చేసిన తప్పిదానికి 180 ఎకరాలకు ఇప్పుడు 88 ఎకరాలు మిగిలిందన్నారు. 88 ఎకరాల్లో స్కూల్‌కు, దవాఖానకు, మూడు మతాల ఆలయాలకు జాగా పోను 36 ఎకరాలు మిగిలిందని, ఇందు లో 2,011 మందికి 80 గజాల చొప్పున స్థలం కేటాయిస్తామన చెప్పారు. మిగిలిన వారికి వెంకటాపూర్, నిజాంపూర్ రోడ్లో స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.