calender_icon.png 11 January, 2026 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లవుతున్నా హామీల అమలేది?

11-01-2026 12:27:05 AM

  1. టీచర్ల సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమం
  2. జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్ 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటు న్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని (జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజే షన్స్) జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. దీనికోసం త్వరలో ఆందోళ న బాట పడుతున్నట్టు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తుందని, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, మొదటి తారీఖున వేత నాలు మినహా మేనిఫెస్టో హామీలు అమలు పర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పడం సరికాదన్నారు. ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బకాయి పడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు జారీ చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

సమస్యల పరిష్కారానికి జాక్టో ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయుల కు ఆయన పిలుపునిచ్చారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.1500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్, కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

మోడల్, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జాక్టో ప్రధానకార్యదర్శి కె.కృష్ణుడు, నాయకులు పి.రాజ భానుచంద్ర ప్రకాష్, కె.మల్లికార్జున్‌రెడ్డి, పర్వత్ సత్యనారాయణ, జుట్టు గజేందర్, జయబాబు తదితరులు పాల్గొన్నారు.