మాజీ మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ మధు యాదవ్
04-04-2026 12:00 AM
కొడంగల్, ఏప్రిల్ 3(విజయక్రాంతి ): బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంతు శ్రీ లోకమ సంద మహారాజ్ జాతర లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును కొడంగల్ మాజీ కౌన్సిలర్ మధు సుదన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.శుక్రవారం నారాయణ పేట జిల్లా కొత్తపల్లి మండలం లోని తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంతు శ్రీ లోకమ సంద మహారాజ్ బావోజో జాతర సందర్బంగా వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కొడంగల్ మాజీ కౌన్సిలర్ మధు యాదవ్ పుష్ప గుచ్ఛం అందించినారు. కార్యక్రమం లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




