17 May, 2026 | 1:30 AM

నీ కోసం పరీక్షా పేపర్ లీక్ చేస్తా

17-05-2026 12:27 AM
  1. డార్లింగ్.. వారానికోసారి నన్ను కలువు!
  2. ఓ విద్యార్థినితో ప్రొఫెసర్ అసభ్యంగా చాటింగ్
  3. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీలో ఘటన

లక్నో, మే16:  విద్యార్థులు పెడదోవపట్టకుండా మార్గనిర్దేశం చేయాల్సిన ఓ ప్రొఫెసరే అడ్డదారి తొక్కాడు. ‘డార్లింగ్ నీ కోసం పరీక్షా పేపర్ లీక్ చేస్తా. ఎక్జామ్‌కు ముందు నీవు నా ఆఫీస్‌కు రా. నన్ను కలువు. నీకు అకడమిక్ బెనిఫిట్స్ కల్పిస్తా’ అని అంటూ ఓ విద్యార్థినిని వేధించాడు. ‘వారానికి ఒకసారి నన్ను కలిస్తే.. పరీక్షల్లో మొత్తం సహాయం చేస్తా’ అని ఒత్తిడి చేశాడు. తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్‌లు బయటకు రావడంతో జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ చివ రకు జైలు పాలయ్యాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీలో జరిగింది. లక్నో యూనివర్సిటీలో పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల జువాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సదరు విద్యార్థినికి అకడమిక్ బెనిఫిట్స్ కల్పిస్తానని నమ్మిస్తూ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు.

తాను చదువుకు న్నానని, సిలబస్ పూర్తి చేశానని యువతి బదులిచ్చింది. అయితే ఆ వేధింపులు ఆగకపోవడంతో సదరు విద్యార్థిని యూనివర్సిటీ యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. దీనికి సం బంధించిన మూడు ఆడియో రికార్డింగ్‌లను బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి సమర్పించింది. ఆ ఆడియో క్లిప్‌ల్లో ప్రొఫె సర్ పరంజీత్ సదరు విద్యార్థినిని.. ‘డార్లింగ్ నా ఆఫీస్ రూమ్‌కు రా. పరీక్షల ప్రశ్నాపత్రాలను ముందే నీకు ఇస్తా’ అని ఆశ చూపుతూ లొంగదీసుకోవడానికి యత్నించాడు.

వారానికి ఒకసారి తనను కలవాలని, అలా చేస్తే పరీక్షల్లో పూర్తి సహాయం చేస్తానని పేర్కొన్నా డు. ఈ వ్యవహారంపై లఖ్నవూ యూనివర్సిటీ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ పరంజీత్ సిం గ్ ఒక విద్యార్థినితో అత్యంత అసభ్యకరంగా మాట్లాడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. యూనివర్సిటీ పరీక్షల నియం త్రణ అధికారి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హసన్‌గంజ్ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ప్రొఫెసర్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రొఫెసర్ తోసిపుచ్చాడు. యూనివర్సిటీ అంతర్గత రాజకీయాల్లో తనను ఇరికించారని పేర్కొ న్నాడు. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన చేపట్టా రు. 24 గంటల్లోగా తన విచారణ నివేదికను సమర్పించాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ జేపీ సైని అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఆదేశించారు.