సీబీఎస్‌ఈలో త్రిభాషా విధానం
- 9వ తరగతి నుంచి అమలు
- ప్రతి విద్యార్థీ మూడు భాషలు నేర్వాల్సిందే..
- ఒక స్వదేశీ భాష తప్పనిసరి
- ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు మినహాయింపు
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
న్యూఢిల్లీ, మే ౧౬: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తన భాషా విధా నంలో కీలక మార్పులు చేసింది. కొత్త జాతీ య విద్యా విధానం (ఎన్‌ఈపీ) అనుగుణంగా తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు మూ డు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. మే 15న విడుదల చేసిన సర్క్యులర్ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ తొమ్మిదో తరగతిలో చేరే ప్రతి విద్యార్థీ మూడు భాషలు చద వాల్సి ఉంటుంది.
ఆ మూడు భాషల్లో ఒక్కటైనా స్వదేశీ భాషలై ఉండాలనే నిబంధన కూడా ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొత్త నిబం ధనలు ప్రవేశపెట్టామని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఇకపై పదో తరగతి విద్యార్థులు మూడో భాషకు ప్రత్యేకంగా బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సబ్జెక్టుకు సం బంధించిన మూల్యాంకనం స్కూలులో విధానాల్లోనే అంతర్గతంగా ఉంటుందని, పైగా విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశమని పేర్కొంది.
ఉపాధ్యాయుల కొరతకు ప్రత్యామ్నాయాలు
ఏప్రిల్ నెలలోనే విద్యా సంవత్సరం ప్రారం భం కావడంతో సీబీఎస్‌ఐ పాఠశాలలకు కొన్ని సడలింపులిచ్చింది. తక్షణం కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉపాధ్యాయుల కొరత సమస్యకు పరిష్కారం చూపింది. ఇప్పటికిప్పుడు భారతీయ భాషలను బోధించే ఉపా ధ్యాయుల కొరత ఉంటే, ఇతర సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చనే వెసులుబాటు కల్పించింది. ఆ సబ్జెక్టులో అనుభవం ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులనూ నియమించుకోవచ్చని తెలిపింది.
మూడో భాషలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను జూలై మొదటి వారంలోపు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు విద్యాసంస్థలు అవసరమైతే రాష్ట్రాల విద్యా పరిశో ధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పుస్తకాలను వినియోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (దివ్యాంగులకు) చట్టప్రకారం రెండో లేదా మూడో భాష చదావాల్సిన అవసరం లేదని, వారికి మినహాయింపు ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది.






