calender_icon.png 14 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయను

14-11-2025 12:27:49 AM

ఏఐసీసీ కార్యదర్శి కుసుమ కుమార్ 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) :  ‘నాకు  ప్రత్యక్ష ఎన్నికల్లో  పోటీ చేయాలనే ఆసక్తి లేదు. పార్టీ ఆర్గనైజేషన్ సేవ చేయడమే నాకు ఇష్టం. జాతీయ రా జకీ యాలపై ఆసక్తి ఉంది’ అని ఏఐసీసీ కార్యదర్శి, ఒడిశా ఇన్‌చార్జ్ జెట్టి కుసుమ కుమార్ అన్నారు. ఒడిశాతో పా టు తెలంగాణలోనూ పార్టీ అభివృద్ధి, బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఏఐసీసీ ఒడిశా ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. గురువారం ఆయన గాంధీభ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే గ్రేటర్ ఎన్నికలపైన దృష్టి పెట్టాలని అధిష్ఠానం చెప్పిందన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్  గెలుస్తుందని, వచ్చే  గ్రేటర్ ఎన్నికల్లోనూ తమ పార్టీనే విజయం సాధిస్తుంద ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ పోతే పదవులు వస్తాయని పేర్కొన్నారు.