calender_icon.png 14 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన ఆర్జేడీ

14-11-2025 12:27:45 AM

మునిపల్లి, నవంబర్13 : మండల కేంద్రమైన మునిపల్లి మోడల్ స్కూల్ ను హైదరాబాద్ రీజనల్ సంయుక్త డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల, కళాశాలలోని తరగతి గదులు, తరగతి గదుల నిర్వహణ, లైబ్రరీ, మధ్యాహ్న భోజనం, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా కోర్స్ తదితర వాటిని పరిశీలించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి మోడల్ స్కూల్ ను జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి లింభాజీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లిక, పాఠశాల అధ్యాపకులు ఉన్నారు.