14-11-2025 12:28:59 AM
చేగుంట నవంబర్ 13,నార్సింగి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ కోసం ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. గురువారం నార్సింగి ఎస్బీఐ చౌరస్తాలో బీసీ నాయకులు ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, రవిందర్, ముస్లిం నాయకులు రబ్బానీ పాల్గొన్నారు.