భూ లక్ష్మమ్మ గుడిని పునర్నిర్మిస్తా
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఏప్రిల్ 3: జాతీయ రహదారి విస్తరణలో తొలగించిన భూ లక్ష్మమ్మ గుడిని తిరిగి రోడ్డు పక్కనే గతంలో వున్న చోట భవిష్యత్తులో ఏర్పాటు చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో పండ్ల దుకాణాలు, పాన్ డబ్బాలు, టిఫిన్ బండ్లు పెట్టుకునే స్థలాలు కోల్పోయిన వారికి రోడ్డు విస్తరణ పనులు పూర్తికాగానే తిరిగి డబ్బాలు, దుకాణాలు ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బాధితుల వద్దకు వెళ్ళి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్ పాల్గొన్నారు.




